Skip to content
రాశిఫలాలు

చంద్ర గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా?ఏ రాశుల వారికి ఎలా ఉంది?

2026 ఆగస్టు 28, శుక్రవారం పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. సహజంగా మిగతా గ్రహాలు మనకు కనపడవు, కాని సూర్య చంద్రులు కనపడతారు. ఖగోళ శాస్త్రపరంగా ఇది ఈ సంవత్సరంలో సంభవించే రెండో చంద్రగ్రహణం, అలాగే 2026 సంవత్సరానికి చివరి చంద్రగ్రహణం. అయితే, భారతదేశంలో గ్రహణ దర్శనం లేదు. మరి అనేక మంది గ్రహణం కనపడదు కాబట్టి మనం నియమాలు పాటించ నక్కరలేదు అని అంటున్నారు. మరి కొందరు మనకు కనపడక పోయినా అది గ్రహణం కిందకు వస్తుంది అని చెపుతున్నారు. ఏది ఏమైనా రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావించుకున్నాం…..

ఆగస్టు 28న గ్రహణ సమయాలు (భారత కాలమానం ప్రకారం)
పాక్షిక గ్రహణ ప్రారంభం: ఉదయం 8:03
గ్రహణ గరిష్ఠ స్థితి: ఉదయం 9:43 ప్రాంతంలో
పాక్షిక గ్రహణ ముగింపు: ఉదయం 11:22

అయితే ఈ సమయాల్లో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చంద్రుడు అస్తమిస్తాడు. అందువల్ల గ్రహణం అక్కడ దర్శనమయ్యే అవకాశం లేదు.

ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్‌, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల సముద్ర ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తి గ్రహణం కనిపించగా, మరికొన్ని ప్రాంతాల్లో గ్రహణంలోని కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. మన ప్రాంతంలో చంద్రగ్రహణ దర్శనం లేకపోతే, ఇక్కడి ప్రజలకు గ్రహణకాల స్పర్శ, మోక్షకాలం, గ్రహణ సూతకం వంటి నియమాలను వర్తింపజేయడం సముచితం కాదనే నిర్ణయం ఉంది. అందువల్ల భారతదేశంలోని గ్రహణ దర్శనం లేని ప్రాంతాలకు ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన గ్రహణ నియమాలు, గ్రహణ ఫలితాలు వర్తించవు అని స్పష్టంగా చెప్పవచ్చు.

ఈసారి మరో విశేషం ఏమిటంటే ఆగస్టు 28న రక్షాబంధన్‌ పర్వదినం, పౌర్ణమి, చంద్రగ్రహణం ఒకే తేదీలో రావడం. దీంతో గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? సూతకం ఉంటుందా? రాఖీ కార్యక్రమాన్ని వాయిదా వేయాలా? అనే సందేహాలు సహజంగానే ఏర్పడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం గ్రహణ దర్శనం. మన ప్రాంతంలో చంద్రుడు గ్రహణ సమయంలో ఆకాశంలో లేకపోవడం వల్ల గ్రహణ దర్శనం ఉండదు. అందువల్ల గ్రహణ దర్శనం ఆధారంగా ఏర్పడే సూతకాది నియమాలను ఇక్కడ అన్వయించాల్సిన అవసరం లేదు. కాబట్టి రక్షాబంధన్‌ పర్వదినాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించవచ్చు.

చంద్రగ్రహణం ఏ రాశిలో సంభవిస్తుంది?

మీ బొడ్డు (Navel) ప్రకారం మీ లక్షణాలు ఏమిటి?

ఈ పాక్షిక చంద్రగ్రహణం కుంభరాశి-శతభిష నక్షత్ర పరిధిలో సంభవించే గ్రహణంగా పరగణించాలి. చంద్రుడు కుంభరాశిలో ఉండగా, సూర్యుడు దానికి ఎదురుగా సింహరాశిలో ఉండే పౌర్ణమి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. కింది రాశి ఫలితాలను సాధారణ గ్రహణ ఫలితాలుగా కాకుండా, గ్రహణం సంభవిస్తున్న రాశి-నక్షత్ర స్థితులను ఆధారంగా చేసుకున్న జ్యోతిష్యపరమైన విశ్లేషణగా మాత్రమే చూడాలి. మనకు కనిపించక పోయినా గ్రహణాన్ని పరిగణించే వారికి మేషం నుంచి మీనం వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూద్దాం….

మేష రాశి- శుభఫలం: మేషరాశివారికి ఈ గ్రహణం అనుకూల ఫలితాలను సూచిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి, పరిచయాల ద్వారా ప్రయోజనాలు, కార్యసిద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ముందడుగు పడవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

వృషభ రాశి- శుభఫలం: వృత్తి, ఉద్యోగం, అధికార సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపట్టే పరిస్థితులు రావచ్చు. ఉన్నతాధికారుల అనుకూలత కలిసివస్తుంది. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది.

కన్యా రాశి- శుభఫలం: ఉద్యోగం, వృత్తి, పోటీ వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై విజయం, ఆరోగ్యపరంగా ఉపశమనం, ఆర్థికంగా స్థిరత్వం పొందే అవకాశాలు కనిపిస్తాయి. క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

ధనుస్సు- శుభఫలం: ధనుస్సురాశివారికి అనుకూల ఫలితాలు సూచించబడుతున్నాయి. ధైర్యం పెరుగుతుంది. ప్రయాణాలు, సమాచార సంబంధిత పనులు, విద్య, వ్యాపార వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. సోదరులు, బంధువుల సహకారం లభించవచ్చు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.

మిథున రాశి-మధ్యమ ఫలితం: దూరప్రయాణాలు, విద్య, ఉద్యోగ సంబంధిత మార్పుల విషయంలో కొంత ఆలోచన అవసరం. నిర్ణయాలు తీసుకునే ముందు పరిస్థితులను పూర్తిగా పరిశీలించాలి. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.

సింహ రాశి- మధ్యమ ఫలితం: భాగస్వామ్యాలు, దాంపత్య సంబంధాలు, వ్యాపార ఒప్పందాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. భాగస్వాములతో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది. అయితే ఓర్పుతో వ్యవహరిస్తే పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవచ్చు.

Top: ఆగస్టు 12 సూర్యగ్రహణం Main large text: ఈ 5 రాశులకు అదృష్టం? Small badge: రేపే!
Surya Grahan 2026: ఆగస్టు 12 సూర్యగ్రహణం.. ఈ 5 రాశులకు శుభకాలమా?

తులా రాశి- మధ్యమ ఫలితం: సంతానం, విద్య, పెట్టుబడులు, ప్రేమ వ్యవహారాల్లో కొంత ఆలోచనతో ముందుకు సాగాలి. అనవసర ఊహాగానాలకు లోనుకాకుండా వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త ఆలోచనలు కలుగుతాయి.

మకర రాశి- మధ్యమ ఫలితం: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. మాటతీరు విషయంలో సంయమనం పాటించాలి. తొందరపడి ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. అయితే క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళికతో పరిస్థితులను చక్కదిద్దుకోవచ్చు.

కర్కాటక రాశి-అశుభ ఫలితం: ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, మానసిక ఒత్తిడికి సంబంధించిన అంశాల్లో జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. అప్పులు, పెట్టుబడులు, ఆస్తి సంబంధిత నిర్ణయాల్లో తొందరపాటు వద్దు.

వృశ్చిక రాశి- అశుభ ఫలితం: కుటుంబం, గృహం, ఆస్తి, వాహనాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆవేశంగా మాట్లాడకుండా సంయమనంతో వ్యవహరించడం మంచిది.

కుంభ రాశి-అశుభ ఫలితం: చంద్రుడు కుంభరాశిలో ఉన్నందున జ్యోతిష్యపరంగా కుంభరాశికి ఈ గ్రహణ స్థితి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. మానసిక ఆందోళన, నిర్ణయాల్లో అయోమయం, కుటుంబ లేదా వ్యక్తిగత విషయాలపై అధిక ఆలోచన కలగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు చేయకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది.

మీన రాశి- అశుభ ఫలితం: ఖర్చులు, నిద్ర, మానసిక ప్రశాంతత, దూరప్రాంత సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు లేదా అదనపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక చింతన, దైవారాధన ద్వారా మనశ్శాంతిని పొందడం మంచిది.

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *