విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. 1960, డిసెంబర్ 13 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. వెంకటేష్ డాన్ బోస్కో, ఎగ్మోర్, మద్రాసు (ప్రస్తుత చెన్నై) నుండి పట్టభద్రుడయ్యారు. మోంటెరే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు.ఎస్.ఏ నుండి ఎంబిఎ పట్టా అందుకున్నాడు. వెంకటేష్ నీరజను వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అబ్బాయి పేరు అర్జున్ రామంత్, అమ్మయిల పేర్లు ఆశ్రిత, హయవాహిని, భావన.
హీరోగా విక్టరీ వెంకటేశ్ (విచ్తొర్య్ వెంకతెష్) తొలి సినిమా ‘మనవూరి పాండవులు’ ఆగస్ట్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేశ్ తెర వయసు నాలుగు పదులే అన్నమాట. ఈ నాలుగు దశాబ్దాలలో వెంకటేశ్ కెరీర్ సాగిన తీరును గమనిస్తే..
పదేళ్ళ వయసులో వెంకటేశ్ తొలిసారి తన తండ్రి డి. రామానాయుడు నిర్మించిన ‘ప్రేమనగర్’ సినిమాలో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు. ఆ తరువాత మళ్ళీ తెరపై కనిపించలేదు. అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చాక వెంకటేశ్ మనసులోని కోరిక తెలుసుకున్న డి. రామానాయుడు ‘కలియుగ పాండవులు’తో తనయుడిని హీరోగా పరిచయం చేశారు. అలా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు వెంకటేశ్ రూపంలో సొంత హీరో దొరికారు. ‘కలియుగ పాండవులు’కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఖుష్బూ తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. పరుచూరి బ్రదర్స్ రచనతో రూపొందిన ‘కలియుగ పాండవులు’ చిత్రం 1986 ఆగస్ట్ 14న విడుదలైంది. ఆ చిత్రం నటునిగా వెంకటేశ్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వెంకటేశ్‌కు బి. గోపాల్ డైరెక్షన్‌లో రూపొందిన ‘రక్తతిలకం’ మంచి విజయాన్ని అందించింది. ఆ పై గోపాల్ దర్శకత్వంలోనే రూపొందిన ‘బొబ్బిలి రాజా’ ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసింది. ‘శత్రువు, కూలీ నంబర్ వన్, క్షణక్షణం’ చిత్రాల తరువాత వెంకటేశ్ నటించిన ‘చంటి’ ఇండస్ట్రీ హిట్‌గా వెలిగింది. ఈ మూవీ హిందీ రీమేక్ ‘అనారీ’లోనూ వెంకటేశ్ నటించి బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. వరుసగా రీమేక్ మూవీస్‌లో నటిస్తూ సందడి చేశారు వెంకటేశ్. ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, లాంటి ఫామిలీ ఎంటర్టైన్స్ తీస్తూ…తొలి ఫాక్షన్ బాక్డ్రాప్ గా ప్రేమించుకుందాం రా….తీసారు. అప్పట్లో దూరదర్శన్ లో వచ్చే చిత్రాల హరి ప్రోగ్రాం లో టాప్ 1 టాప్ 2 లో దాదాపు 6 నెలలు మేఘాలే తాకింది హై హై లెస్సా అనే పాట వేసే వారు ఆ తరువాతపెళ్ళిచేసుకుందాం, సూర్యవంశం, గణేశ్, ప్రేమంటే ఇదేరా, రాజా’ సినిమాలతో వరుస విజయాలు చూశారు వెంకటేశ్. ‘కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, వసంతం, మల్లీశ్వరి, సంక్రాంతి, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి, నమో వేంకటేశ’ వంటి సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలుమార్లు వరుస విజయాలతో సాగిన వెంకటేశ్ నటునిగానూ తనదైన బాణీ పలికించారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను రంజింప చేశారు. ‘ప్రేమ’ చిత్రంతో తొలిసారి ఉత్తమనటునిగా నంది అవార్డు అందుకున్న వెంకటేశ్.. తరువాత ‘ధర్మచక్రం, గణేశ్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలతోనూ బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. ఐదుసార్లు ఉత్తమ నటునిగా నందిని అందుకున్న ఏకైక హీరోగా నిలిచారు వెంకటేశ్.
ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు కాగా 2025 సంవత్సరంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సీనియర్ హీరోల్లో 300 కోట్లు సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించాడు
ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కుష్బూ ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.
సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్యతో ఆయన ఏడు (సూపర్ పోలీస్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, రాజా, పెళ్ళి చేసుకుందాం, జయం మనదేరా, దేవి పుత్రుడు) సినిమాలు చేసారు. మీనాతో నాలుగు సినిమాలు (చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం) చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. ఆర్తీ అగర్వాల్తో మూడు సినిమాలు (నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి) చేసారు. ఆ మూడు కూడా విజయం సాధించాయి.
వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు. పైగా రాఘవేంద్రరావు వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం చేశారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందడంతో పాటు వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ లభించింది.
1993లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ప్రయాణిస్తున్న విమానం తిరుపతిలో అత్యవసరంగా ల్యాండ్ అయి పెద్ద ప్రమాదం నుండి వీరు తృటిలో తప్పించుకున్నారు.
1986 కలియుగ పాండవులు చిత్రానికి గానూ ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నంది పురస్కారం
1988 బ్రహ్మపుత్రుడు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారం
1988 స్వర్ణకమలం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది, ఫిల్మ్ ఫేర్ పురస్కారం
1990 బొబ్బిలి రాజా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారం
1991 శత్రువు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా భాగ్యనగర్ పురస్కారం
1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్, మద్రాస్ చిత్ర అభిమానుల పురస్కారం
1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా యువవాహిని పురస్కారం , సినీగోయర్స్ పురస్కారం
1993 అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారం, సినీగోయర్స్ పురస్కారం
1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది, ఫిల్మ్ ఫేర్, కళాసాగర్, వంశీ బర్కిలీ పురస్కారం
1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది, ఫిల్మ్ ఫేర్, కిన్నెర పురస్కారం
2000 కలిసుందాం రా చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వేరులే చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
ప్రేక్షకుల రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులూ సొంతం చేసుకున్న వెంకటేశ్.. యంగ్ హీరోస్ తోనూ నటించి సక్సెస్ చూశారు. గత యేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ విజయం సాధించిన వెంకటేశ్ ‘నాట్ ఔట్’గానే సాగుతున్నారు. తన తరం హీరో చిరంజీవితో కలసి ‘మన శంకర వరప్రసాద్ గారు’లో నటించి ఆకట్టుకున్నారు వెంకీ. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘ఆదర్శకుటుంబం ఆఖ్47’లోనూ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారాయన. రాబోయే సినిమాలతోనూ వెంకటేశ్ అలరిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.




