
Pulivendula Politics: మనకు భగవంతుడు రెండు చెవులు, మంచి చెడు వినటానికి, రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు మంచి గాలిని పీల్చి, చెడుగాలి వదలటానికి ఇచ్చి ఒక్క నాలుక మాత్రమే ఇచ్చాడు. అది మితంగా మాట్లాడమని. కాని మనం నాలుక కే ఎక్కువ పని చెపుతాం…నోటికి వచ్చినట్లు మాట్లాడతాం…..వెనుకా ముందు చూసుకోం….
ఇది మాజి ముఖ్యమంత్రి వై.యెస్.జగన్ కూడా మర్చిపోయినట్లున్నారు….అసలు మాజి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారు…ఎందుకింత రచ్చ….చూద్దాం…
Pulivendula Politics: జగన్ ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గం పులివెందుల నుంచే రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జులకు ఆయన ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘‘మీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే, అక్కడి ఇన్ఛార్జికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ విషయంలో నన్ను అడగాల్సిన పనిలేదు’’ అంటూ జగన్ హెచ్చరించినట్లు ప్రచారంలో ఉన్న వీడియోను నెటిజన్లు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.
Pulivendula Politics: పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ!
వైఎస్ కుటుంబానికి రాజకీయ కంచుకోటగా పేరున్న పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పరిణామాలు వైసీపీకి కొత్త సవాల్‌గా మారాయి. మొత్తం 40 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో పలు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయినట్లు వార్తలు వెలువడ్డాయి.
దీంతో ఆయా వార్డుల్లో అధికార కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా విడుదలైతేనే ఎన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయనే దానిపై స్పష్టత వస్తుంది.
Pulivendula Politics: జగన్‌కు టికెట్ ఉంటుందా?
ఇక్కడే అసలు రాజకీయ చర్చ మొదలైంది. ఇతర నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగితే అక్కడి ఇన్ఛార్జులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఉండదని హెచ్చరించిన జగన్.. తన సొంత నియోజకవర్గం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్నను నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
‘‘పులివెందులలో ఏకగ్రీవాలు జరిగితే జగన్ తనకు తానే టికెట్ నిరాకరించుకుంటారా?’’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో జగన్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పంచుకుంటూ మీమ్స్ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇది ప్రధానంగా రాజకీయ వ్యంగ్యమే. జగన్ తన వ్యాఖ్యలను సొంత నియోజకవర్గానికి ఏ విధంగా వర్తింపజేస్తారనే అంశంపై స్పష్టత లేదు.
వైసీపీ వాదన మరోలా ఉంది!
మరోవైపు నామినేషన్లు దాఖలు చేయలేకపోవడానికి అధికార పక్షం సృష్టించిన అడ్డంకులే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. పులివెందులతో సహా పలు ప్రాంతాల్లో అభ్యర్థులను బెదిరించారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నామినేషన్లు వేయకపోవడాన్ని పూర్తిగా పార్టీ సంస్థాగత వైఫల్యంగా నిర్ధారించడం సరికాదు.
సొంత కోటలోనే అసలు పరీక్ష!
పులివెందుల ఫలితాలు వైసీపీకి రాజకీయంగా ముఖ్యమైనవి. నియోజకవర్గంపై పార్టీకి ఉన్న పట్టును అంచనా వేసేందుకు ఈ ఎన్నికలు ఒక అవకాశంగా మారాయి. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతోపాటు జగన్ తన అల్టిమేటంపై ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి ఇతరులకు జగన్ విధించిన నిబంధన ఇప్పుడు ఆయనకే వర్తిస్తుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
also read: స్టూడియో వన్ నెట్వర్క్ ఛానల్స్
Table of Contents
https://en.wikipedia.org/wiki/Pulivendla_Assembly_constituency





1 comment