Skip to content
MARKET UPDATE

SENSEX: 73,598.67, change ▼ −8.08 (−0.01%). Source Yahoo Finance, as of 27 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,678.00, change ▼ −71.75 (−0.32%). Source NSE, as of 28 Oct 2026 9:14 AM IST. GOLD 24K / 999: ₹1,41,431 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,29,551 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. SILVER 999: ₹1,92,499 / kg. Source IBJA, as of 27 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

వార్తలు

Varanasi Release Date: మహేష్ బాబు అభిమానులకు… ‘వారణాసి’ వాయిదా వార్తల్లో నిజమెంత?

Varanasi Release ‘వారణాసి’ వాయిదా? మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్!
‘వారణాసి’ వాయిదా?మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్!

Varanasi Release:

varanasi release date: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా పై అనేక రూమర్స్ తలెత్తుతున్నాయి. అయితే వాటికి చెక్ పెడుతూ అసలు ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో క్లారిటి ఇచ్చారు. భారతీయ సినీ పరిశ్రమతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ గ్లోబల్ డ్వెంచర్ మూవీ విడుదలపై తాజాగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమేనంటూ వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Varanasi Release Date మారిందా?

‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు రాజమౌళి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు చిత్రబృందం నుంచి విడుదల తేదీని మార్చుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సినిమా వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ధ్రువీకరించలేని పరిస్థితి నెలకొంది.

షూటింగ్ ఎంతవరకు పూర్తయింది?

ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి ఇప్పటికే పలు ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని రాజమౌళి గతంలో వెల్లడించారు. మిగిలిన సన్నివేశాలను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన వార్తల ప్రకారం దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మొత్తం చిత్రీకరణ పూర్తయిందనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఐమ్యాక్స్‌లో జక్కన్న భారీ ప్లానింగ్!

ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ అనుభూతికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలన్నది రాజమౌళి లక్ష్యం.

IND vs NZ 34d T20
IND vs NZ 3rd T20: అభిషేక్ శర్మ విధ్వంసం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం!

సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. చిత్రీకరణతో పాటు సీజీఐ, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.

అయితే అంతర్జాతీయంగా ఎక్స్‌క్లూజివ్ ఐమ్యాక్స్ రిలీజ్ విండో ఖరారైందన్న ప్రచారంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

మహేష్ బాబు అభిమానుల్లో భారీ అంచనాలు

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తొలిసారి మహేష్ బాబుతో సినిమా రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్
Instagram New Feature: యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్.. 90 నిమిషాల లాంగ్ వీడియోలు!

ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. విడుదల తేదీపై కొత్త ప్రకటన వచ్చే వరకు వాయిదా వార్తలను కేవలం ప్రచారంగానే పరిగణించాల్సి ఉంటుంది.

also read: హోటల్ గదికి రమ్మన్న దర్శకుడు… చివరికి సినిమా నుంచి తొలగింపు!

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.