MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
క్రీడలు

IND vs WI 1st T20 Highlights: మొదటి టి20 లో వెస్టిండీస్ ని ఊత కోత కోసిన ఇండియా

చివరిగా నవీకరించబడింది:

అయ్యర్ విధ్వంసం! 43 బంతుల్లో 102*
అయ్యర్ విధ్వంసం! 43 బంతుల్లో 102*

IND vs WI 1st T20 Highlights: మొదటి టి20 లో వెస్టిండీస్ ని ఊత కోత కోసిన ఇండియా

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ప్రత్యర్ధి వెస్ట్ ఇండీస్ ను ఊత కోత కోసింది. మొదట భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నమన్ ధీర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తన తొలి T20Iలోనే ప్రభావం చూపించాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ చెరో వికెట్ సాధించారు. వెస్టిండీస్ పవర్‌ప్లేలో మంచి ఆరంభం చేసినా వరుస వికెట్లు కోల్పోయింది. కమిల్ పూరన్ 12 పరుగులకు ఔట్ కాగా, షిమ్రోన్ హెట్‌మయర్ 5 పరుగులకు రనౌట్ అయ్యాడు. రోవ్‌మన్ పావెల్ డకౌట్ అయ్యాడు.

Read also: https://studioonenews.com/sports/ms-dhoni-retirement-7-number-jersey-6-years/

ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా నిర్ణీత ఓవర్ల కంటే ముందే ఘన విజయాన్ని సాధించింది.

IND vs WI 1st T20 Highlights: భారత్‌కు 172 పరుగుల లక్ష్యం

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలోనే కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విండీస్ బౌలర్లపై అయ్యర్ మొదటి నుంచే ఎదురుదాడి చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

అయ్యర్ విధ్వంసం.. 43 బంతుల్లో 102

శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించాడు. కేవలం 43 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అయ్యర్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. విండీస్ బౌలర్లు ఎన్ని మార్పులు చేసినా అయ్యర్ జోరును అడ్డుకోలేకపోయారు. గ్రౌండ్ నలువైపులా బౌండరీలు కొడుతూ మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు మళ్లించాడు. అయ్యర్ సెంచరీ భారత ఛేజింగ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

హోప్–రదర్‌ఫోర్డ్ పోరాటం

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 56 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్ 52 పరుగులు చేసి హోప్‌కు మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు నిలబడటంతో ఒక దశలో విండీస్ భారీ స్కోరు దిశగా వెళ్తుందని అనిపించింది. కానీ భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 171 పరుగుల వద్ద ముగిసింది.

El nino 2027
El Nino 2027: 1877 రికార్డును మించుతుందా? ప్రపంచానికి భారీ వాతావరణ ముప్పు

డెబ్యూలోనే నమన ధీర్ అదరగొట్టాడు

భారత్ తరఫున తొలి టీ20 ఆడిన నమన ధీర్ బంతితో అద్భుతంగా రాణించాడు. నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి భారత బౌలింగ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా కీలక వికెట్లు తీసి విండీస్‌ను పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

ఇషాన్ కిషన్ కీలక సహకారం

అయ్యర్‌కు మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ మంచి సహకారం అందించాడు. అతడు 27 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు. అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా ఇషాన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా లక్ష్యాన్ని చేరుకుంది.

14.4 ఓవర్లలోనే మ్యాచ్ ముగింపు

వెస్టిండీస్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలో 172/2 స్కోరుతో ఛేదించింది. ఇంకా 32 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించడం భారత్ బ్యాటింగ్ ఆధిపత్యాన్ని చూపించింది.

మ్యాచ్ స్కోర్

వెస్టిండీస్: 171 ఆలౌట్

షాయ్ హోప్ – 56
షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్ – 52

భారత్ బౌలింగ్:
నమన ధీర్ – 3 వికెట్లు

భారత్: 172/2 – 14.4 ఓవర్లు

AP Lowest Majority MLAs, అత్యల్ప మెజారిటీ
Lowest Majority MLAs AP: ఆంధ్ర ప్రదేశ్ లో అత్యల్ప మెజారిటీ తో గెలిచిన MLA లు ఎవరంటే?

శ్రేయస్ అయ్యర్ – 102* (43)
ఇషాన్ కిషన్ – 37* (27)

ఫలితం: భారత్ 8 వికెట్ల తేడాతో విజయం

సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం

ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత అదే జోరును కొనసాగిస్తున్న టీమిండియాకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ, నమన ధీర్ డెబ్యూ ప్రదర్శన భారత్‌కు పెద్ద ప్లస్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. వెస్టిండీస్ 171 పరుగులు చేసినప్పటికీ అయ్యర్ విధ్వంసం ముందు ఆ స్కోరు ఏమాత్రం సరిపోలేదు. మొత్తంగా తొలి టీ20లో భారత్ ఒకపక్కా ఆధిపత్యం చూపిస్తూ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది.

Read also: సచిన్‌తో సమానంగా మొదలైన ప్రయాణం.. కాంబ్లీ కెరీర్ ఎందుకు ముగిసింది? రాజకీయాలా.. https://studioonenews.com/telugu-news/vinod-kambli-career-health-politics/

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.