Skip to content
వార్తలు

Captain Smit Machchhar: టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ నుంచి ఆకాశంలో 174 మందిని కాపాడిన హీరో, వరకూ

చివరిగా నవీకరించబడింది:

Captain Smit Machchhar
Captain Smit Machchhar

Captain Smit Machchhar: టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ నుంచి ఆకాశంలో 174 మందిని కాపాడిన హీరో వరకూ

Captain Smit Machchhar: టెక్స్‌టైల్ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకున్న ఓ యువకుడు… అనుకోకుండా ఒక ఏవియేషన్ సెమినార్‌కు వెళ్లాడు. అక్కడ మొదలైన ఆసక్తి అతడిని న్యూజిలాండ్‌లో పైలట్ శిక్షణ వరకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి స్పైస్‌జెట్‌, ఆపై Flydubai వరకు సాగిన ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బోయింగ్ 737 రకానికి చెందిన 737-800, 737 MAX 8, MAX 9 విమానాలలో ఆయనకు దాదాపు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. స్పైస్‌జెట్‌లో పనిచేసిన కాలంలోనే 6,400 గంటలకు పైగా ‘పైలట్-ఇన్-కమాండ్’గా బాధ్యతలు నిర్వర్తించారు. జూన్ 2022లో ఆయన డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా ఫ్లై దుబాయ్‌లో చేరారు.

ఆయనే కెప్టెన్ స్మిత్ మచ్ఛార్.

సెప్టెంబర్ 30, 2026న Flydubai FZ1073లో జరిగిన అత్యవసర ఘటన సమయంలో తీవ్రంగా గాయపడినా సమయస్ఫూర్తి ప్రదర్శించి విమానంలోని వారిని కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన తర్వాత భారత్‌తో పాటు ఇజ్రాయెల్‌లోనూ ఆయన ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 27 మంది చిన్నారుల సహా మొత్తం 174 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో ఒమన్ జాతీయుడైన కో-పైలట్ కెప్టెన్ మచ్ఛార్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో విమానం 14,000 అడుగుల దిగువకు పడిపోవడం, ఎమర్జెన్సీ హెచ్చరికలు రావడం జరిగిపోయాయి. తీవ్రగాయాలతో రక్తమోడుతున్నా కెప్టెన్ మచ్ఛార్ కాక్‌‌పిట్ డోర్‌ను ఎలాగోలా తెరవగలిగారు. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు వెంటనే లోపలికి వచ్చి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గతేడాది పాడ్‌కాస్ట్‌లో విమాన ప్రయాణికుల్లో వైద్యులు ఉండటం ఎంత అవసరమో మచ్ఛార్ వివరించారు. ‘‘గాల్లో ఉన్నప్పుడు అనుకోనిది ఏదైనా జరిగితే మన పరిస్థితి ఏంటి? అదే విమానంలో డాక్టర్లు, నర్సులు ఉంటే ముప్పు తప్పుతుంది.. వైద్యంలో మంచి శిక్షణ పొందిన అలాంటి వారు విమానం ఎప్పుడూ ఉంటారని చెప్పలేం’’ అని అన్నారు. సరిగ్గా ఏడాది తర్వాత మచ్ఛార్‌కు అటువంటి పరిస్థితే ఏదురయ్యింది. కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనకు విమానంలో ప్రయాణిస్తున్న వైద్యుడు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. ఆ క్షణంలో డాక్టర్ లేకుంటే ఆయన పరిస్థితి ఏమయ్యేది? ఒక్కసారిగా విమానం 14 వేల అడుగుల దిగువకు పడిపోవడంతో ఓపిక తెచ్చుకుని కాక్‌పీట్ డోర్‌ను తెరవగలిగారు.

పైలట్ కావడం చిన్ననాటి కల కాదు

స్మిత్ మచ్ఛార్ చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలలు కన్న వ్యక్తి కాదు. స్మిత్ మచ్ఛార్ గుజరాతీ మూలాలున్న ఆయన ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతానికి చెందినవారు. కుటుంబం టెక్స్‌టైల్ వ్యాపారంలో ఉండటంతో అదే రంగంలో స్థిరపడాలని భావించారు. అందుకే టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత మేనేజ్‌మెంట్ విద్యను కొనసాగిస్తున్న సమయంలో ఓ ఏవియేషన్ సెమినార్‌కు హాజరయ్యారు. అక్కడే విమానయాన రంగంపై ఆసక్తి మొదలైంది. ఆ ఒక్క నిర్ణయమే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తరువాత పైలట్ శిక్షణ కోసం న్యూజిలాండ్ వెళ్లి కమర్షియల్ ఏవియేషన్‌లోకి అడుగుపెట్టారు.

స్పైస్‌జెట్‌తో కమర్షియల్ కెరీర్

శిక్షణ పూర్తయిన తర్వాత మచ్ఛార్ స్పైస్‌జెట్‌లో పైలట్‌గా తన కమర్షియల్ కెరీర్ ప్రారంభించారు. కాలక్రమంలో బోయింగ్ 737 విమానాలపై విస్తృత అనుభవం సంపాదించారు. పైలట్‌గా మాత్రమే కాకుండా శిక్షణ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు. తరువాత Flydubaiలో కెప్టెన్‌గా చేరి అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు నడిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రొఫైల్ వివరాల ప్రకారం ఆయనకు దాదాపు 10 వేల గంటలకు చేరువైన ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఇందులో వేల గంటలు పైలట్-ఇన్-కమాండ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

సెప్టెంబర్ 30న ఏం జరిగింది?

సెప్టెంబర్ 30న Flydubai FZ1073 దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమాన ప్రయాణం మధ్యలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. కో-పైలట్ కెప్టెన్ మచ్ఛార్‌పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత విమానం అత్యంత వేగంగా దిగువకు పడిపోయింది. Flight-tracking డేటా ప్రకారం కేవలం కొన్ని సెకన్లలోనే విమానం 14,000 అడుగులకు పైగా దిగజారినట్లు నమోదైంది.

తీవ్ర గాయాలతోనూ డోర్ అన్‌లాక్

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

కెప్టెన్ మచ్ఛార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయినా విమానం ప్రమాదంలో ఉందని గ్రహించి కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేయగలిగారు. ఆ ఒక్క చర్యే పరిస్థితిని మలుపుతిప్పింది. డోర్ తెరుచుకోవడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు Flydubai పైలట్లు విమాన నియంత్రణ చేపట్టి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

174 మంది సురక్షితం

ఈ ఘటన సమయంలో విమానంలో 174 మంది ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కెప్టెన్ మచ్ఛార్‌కు శస్త్రచికిత్స నిర్వహించగా ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు భారత అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా మచ్ఛార్ ధైర్యాన్ని ప్రశంసించారు.

“మిగతావారిని చనిపోనివ్వలేను”

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మచ్ఛార్ ఘటనను గుర్తుచేసుకుంటూ, తనతో పాటు విమానంలోని మిగతావారిని కాపాడాలన్న ఆలోచనే ఆ సమయంలో తనను ముందుకు నడిపిందని చెప్పారు. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించడం, కాక్‌పిట్ డోర్‌ను తెరవడం ఘటనలో కీలకంగా మారింది.

గతంలో చెప్పిన మాటలే నిజమయ్యాయి

ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఉంది. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విమానాల్లో వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రయాణికుల్లో డాక్టర్లు లేదా నర్సులు ఉండటం ఎంత కీలకమో మచ్ఛార్ ప్రస్తావించారు. విచిత్రంగా, ఈ ఘటనలో ఆయనకే వైద్య సహాయం అవసరమైంది. ప్రయాణికుల్లో ఉన్న వైద్యులు తొలి చికిత్స అందించినట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ఒకప్పుడు తాను ఊహాత్మకంగా చెప్పిన పరిస్థితినే స్వయంగా ఎదుర్కొనాల్సి రావడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.

దాడి వెనుక ఉద్దేశం ఇంకా దర్యాప్తులోనే

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

కో-పైలట్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేయాలని ప్రయత్నించాడని ఇజ్రాయెల్ అధికారులు ఆరోపించారు. అయితే అది తుది నిర్ధారణ కాదు. UAE అధికారిక దర్యాప్తు ఘటనకు ఉగ్రవాద సంబంధం ఉందా? ముందస్తు ప్రణాళిక జరిగిందా? దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే అంశాలను పరిశీలిస్తోంది. Flydubai కూడా దర్యాప్తు పూర్తికాకముందే ఉద్దేశంపై ఊహాగానాలు చేయొద్దని స్పష్టం చేసింది.

హనుమాన్ చాలీసా నే కాపాడిందా?

కుటుంబ టెక్స్‌టైల్ వ్యాపారంలో స్థిరపడాల్సిన వ్యక్తి… ఒక సెమినార్‌తో తన దిశ మార్చుకున్నాడు. ఆ నిర్ణయం అతడిని పైలట్‌గా మార్చింది. దశాబ్దానికి పైగా సంపాదించిన శిక్షణ, ఫ్లయింగ్ అనుభవం, కాక్‌పిట్‌లో తీసుకున్న ఒక్క కీలక నిర్ణయం—ఇవన్నీ కలిసి ఒక భారీ ప్రమాదాన్ని తప్పించడంలో సహాయపడ్డాయి. అందుకే కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ కథ ఇప్పుడు కేవలం ఒక పైలట్ కెరీర్ స్టోరీ కాదు. అంతే కాదు తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తో సంభాషించి నప్పుడు హనుమాన్ చాలీసా చదివాను ఆ సమయం లో అని చెప్పటం కొసమెరుపు.

ఒత్తిడిలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత కీలకమో చెప్పే నిజ జీవిత కథగా మారింది.

Read Also: https://studioonenews.com/explainers/ys-sharmila-political-journey/

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.