Amaravati Grid Roads: అమరావతిలో 300 కిలోమీటర్ల గ్రిడ్ రోడ్లు.. వందేళ్ల ట్రాఫిక్ సమస్యకు చెక్!
Amaravati Grid Roads: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సుమారు 300 కిలోమీటర్ల మేర గ్రిడ్ విధానంలో రహదారులను నిర్మిస్తోంది. నగరంలో జనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరిగినా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ రహదారుల వ్యవస్థను రూపొందిస్తున్నారు. విశాలమైన రోడ్లు, సిగ్నల్ ఫ్రీ ప్రయాణం, గ్రీన్…