Skip to content
క్రైమ్

Pakistan Blasts: పాకిస్థాన్‌లో మసీదు వద్ద భారీ పేలుడు.. 16 మంది మృతి

చివరిగా నవీకరించబడింది:


Pakistan Blasts: పాకిస్థాన్‌లో మసీదు వద్ద భారీ పేలుడు.. 16 మంది మృతి

Pakistan లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం భారీ దాడి జరిగింది. కోహాట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రాంతాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో మసీదు, సమీపంలోని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మృతుల్లో ఐదుగురు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. 50 మందికి పైగా గాయపడినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని పోలీస్ లైన్స్ కాంపౌండ్ వైపు తీసుకొచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన తీరుపై విచారణ కొనసాగుతోంది. పేలుడు అనంతరం సాయుధ దుండగులు, భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు కూడా సమాచారం. భద్రతా బలగాలు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్కొ నసాగించాయి.పేలుడుతో మసీదు పైకప్పు, గోడల భాగాలు కూలిపోయాయి. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు చర్యలు చేపట్టాయి.ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థ కూడా అధికారికంగా బాధ్యత స్వీకరించలేదు. ఘటనపై పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కోహాట్‌లో జరిగిన ఈ భారీ దాడితో పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళన పెరిగింది.

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే
Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.