King Cobra Swallows Python: ఎక్కడైనా పాము గుడ్లను తింటుంది లేదా కప్పలను, చేపలను, లేదా చిన్న చిన్న కీటకాలను తింటుంది. సరే కొండచిలువ పామును తిన్నది అంటే సరే…దీనికి రివర్స్ లో నాగు పాము కొండ చిలువను మింగేసింది. కలికాలం అంటే ఇదే కాబోలు…
కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కొండచిలువలు(Python) చిన్న జంతువులు, పక్షులు, ఇతర పాములను మింగడం చూస్తుంటాం. కానీ ఈసారి 12 అడుగుల King Kobra కింగ్ కోబ్రా ఒక Python ను మింగేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కర్ణాటకలోని బెల్తంగడి మండలం తెంకాకరందూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తోటలో భారీ కింగ్ King Kobra కోబ్రాను గమనించి వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో పాము అప్పటికే మింగిన కొండచిలువను బయటకు కక్కేసింది. ఈ దృశ్యం చూసిన అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
King Kobra కింగ్ కోబ్రాలు ఇతర పాములను వేటాడటంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటాయి. వాటి ఆహారంలో విషపూరితమైన పాములతో పాటు విషరహితమైన పాములు కూడా ఉంటాయి. అందుకే ఒక కింగ్ కోబ్రా మరో పెద్ద పామును తినడం పూర్తిగా అసాధారణం కాదని స్నేక్ క్యాచర్లు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాముగా కింగ్ కోబ్రా గుర్తింపు పొందింది. కొన్ని కింగ్ కోబ్రాలు ఐదు మీటర్లకంటే ఎక్కువ పొడవు పెరిగే అవకాశం ఉంది. ఇతర పాములను వేటాడేటప్పుడు దాని పరిమాణం, వేగం, విషం ప్రధాన ఆయుధాలుగా పనిచేస్తాయి.
కింగ్ కోబ్రా తన ఎరను కాటు వేసి విషంతో బలహీనపరిచిన తర్వాత పూర్తిగా మింగేస్తుంది. పాముల పుర్రె, దవడల నిర్మాణం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండటం వల్ల తమ శరీర పరిమాణానికి దగ్గరగా ఉన్న ఎరను కూడా మింగగలవు.
మనుషుల్లా పాముల దవడ ఎముకలు పూర్తిగా కలిసిపోయి ఉండవు. అందుకే నోరు విస్తారంగా తెరిచి పెద్ద ఎరను మింగగల సామర్థ్యం వాటికి ఉంటుంది. భారీ ఆహారం తీసుకున్న తర్వాత పాములు చాలా రోజుల పాటు మరోసారి ఆహారం తీసుకోకుండా ఉండగలవు.
కర్ణాటకలో కనిపించిన ఈ 12 అడుగుల కింగ్ కోబ్రా ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొండచిలువనే మింగేసిన భారీ నాగుపాము దృశ్యం చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.



