Weekly Horoscope: వార ఫలాలు
మేషరాశి: మేషరాశి వారికి 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ 2026 వరకు ఈ వారం రోజుల కాలంలోనూ ఏ ఏ గ్రహాల అనుకూలత ఉంది అంటే నాలుగు గ్రహాల అనుకూలత చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఖర్చు ఎక్కువగా గా ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన డబ్బు సరిపోకపోవచ్చు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. వ్యయ ప్రయాసలకు లోనయి దూరప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది. అలాగే స్త్రీల వల్ల చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఉంది. విద్య విషయంలో చాలా బాగుంటుంది. అని చెప్పి తెలియజెప్పొచ్చు. సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. శత్రువుల సంఖ్య తగ్గుతోంది మిత్రుల సంఖ్య పెరుగుతోంది అయితే స్త్రీలతో మటుకు ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తులవారు ఇత్యాది వారందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ధనము చేతికి రావడం ఆలస్యం. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి సంచారము షష్టస్థానంలోకి వచ్చి బుధునితో కలిసి చాలా బ్రహ్మాండమైన యోగం ఏర్పడి ఉన్నది కాబట్టి ఈ బుధాదిత్య యోగం వల్ల అనేక రకాలైనటువంటి ఆదాయం రావడము ఆదాయ మార్గాలు కనిపించడము కీర్తి ప్రతిష్టలు పెరగడము జరుగుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే కుజునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిదేవత కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేయండి.
వృషభ రాశి: వృషభ రాశి వారికి కుటుంబంలో ఐకమత్యం తగ్గుతుంది ఏదైనా అవమానాలకి తట్టుకునే విధంగా మీ యొక్క మెదడు ఉండాలి. లాభాల బాటలో ఉన్నారా అంటే ఇంకా అంత లాభాల బాటలో లేరు పూర్వం పెట్టిన పెట్టుబడులు మీకు ఇప్పుడు కలిసి వస్తున్నాయి. ఎవరి మీద ఆధారపడ్డా కూడా వాళ్ళు మనల్ని మిస్ గైడ్ చేసేస్తారు ఇలాంటి ఆలోచనలతో ఉండండి. ఎవరి మాట వినొద్దు ఒక భగవంతుడికి చెప్పుకోండి. గోపూజ చేసుకోండి అలాగే పెద్దలకి కి గౌరవించండి. లలితా సహస్రనామాన్ని కూడా చదవండి అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు చేసేటటువంటి ఏ సేవ అయినా మీకు మనశశాంతిని ఇస్తుంది. సంతాన విషయంలో ముఖ్యంగా పెంచుకునేటటువంటి పిల్లలు ఉంటారు. దత్తత తీసుకున్నటువంటి పిల్లలు ఉంటారు. ఇలాంటి సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. అని చెప్పి గట్టిగా తెలియజేస్తూ ఉన్నానండి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడంతో పాటుగా నవధాన్యాలు కూడా దానం చేస్తే చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను .
మిధున రాశి: మిధున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే ఐదు గ్రహాల ఉనికి అత్యద్భుతంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతానం కావాలి అనుకునే వారికి కూడా సంతానం కలుగుతారు. ద్వితీయ స్థానంలో గురువుగారు ఉచ్చ స్థితిలో ఉండగా పంచమస్థానం లో శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూన్నారు ఇది చాలా చాలా అదృష్టవంతమైనటువంటి కాలం. ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏమనా మార్పులు వచ్చాయా అంటే రాశిలో ఉండి ఎక్కువగా ఉద్రేకం చెందించేటటువంటి కుజుని యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలోకి వచ్చేసింది కాకపోతే ఉచ్చ కుజునితో ఉన్నారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి రాజకీయ నాయకుల వల్ల చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంటుంది. మెడికల్ స్టూడెంట్స్ కి గాని మెడికల్ ప్రాక్టీస్ లో ఉన్నవారికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా ప్రశాంత జీవితం వస్తుంది. పూర్వం ఉన్న కష్టాలు తగ్గిపోతాయని చెప్పొచ్చు. విద్యార్థులకి విద్య పరంగా స్కాలర్షిప్లు రావడం గాన ఇలాంటి మంచి ఫలితాలు వస్తూ ఉండగా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేస చేసే ప్రయత్నాలన్నీ ఆ ఫలవంతమయ్యి స్థిరచరాస్తుల యొక్క వృద్ధి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉందండి. విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. క్షేమంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి మాట తీరు బాగుంటుంది. మనోభీష్టం అనేది నెరవేరుతుంది అలాగే కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. మాట తీరు బాగుంటుంది సంతానం బాగుంటారు భార్యా భర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. ఏదైనా రుణాలు కావాలి అనుకున్న వారికి కూడా రుణాలు దొరికేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రాశిలోకి కుజుడు వచ్చి ఉన్నారు. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలం. మీ హితము కోరేటటువంటి హితోభిలాషులు ఉంటారు వాళ్ళతో సంప్రదించుకొని ఏదైనా తుది నిర్ణయం తీసుకోండి. వారాంతంలో చంద్రుని యొక్క సంచారము షష్ట స్థానంలోకి వెళ్ళింది. ఇది కూడా చాలా అనుకూలమే. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత విజయము ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పుకోదగినటువంటి అంశాలే ధన ఆదాయం విషయంలో గాని కీర్తి ప్రతిష్టల విషయంలో గాని అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో గాని ఏమాత్రము తీసిపోని విధంగా మంచి మంచి ఫలితాలు ఉంటాయి. అమితమైనటువంటి బలంతో ఉంటారు దారుఢ్యంతో ఉంటారన్నమాట.
కన్యరాశి: కన్యరాశి వారికి శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు పెరగడానికి అవకాశం ఉంది. మొండితనం ఎక్కువగా ఉండడం ఎవరన్నా మీకు ఏదనా మంచి సలహా చెప్పినా కూడా వాళ్ళు ఏదో స్వార్థాన్ని మనసులో పెట్టుకొని మనకి ఇలాంటి సలహాలు చెప్తున్నారు అని అనుకునే విధంగా మీరు ఆలోచిస్తారు. ఉద్యోగ జీవితం, కూడా పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. అన్నదమ్మల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి దానధర్మాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగతంగా మీరు చాలా మంచివారు అనేటటువంటి పేరు తెచ్చుకుంటారు. అయితే ఆ పేరు ఇప్పుడు దేనికి పనికి రాదు ఊరికే మంచివాడు అనిపించుకోవడమే తప్ప మన పనులు జరగడానికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఓర్పు కలిగి ఉండాలి సంయమనం పాటిస్తూ ఉండాలి. పెద్ద గ్రహాలు ఎప్పుడైతే షష్టంలోనూ లాభంలోన ఉన్నాయో ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు చాలా చాలా బాగుంటాయి. మీరు ఎంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారో ఎంత కృషి చేస్తూ వెళ్తారో అప్పుడు మాత్రమే అభివృద్ధి కనిపించి విజయవకాశాలు ఉంటాయి. రాశిలో బుధుడు గాని సప్తమంలో శని గారు గాని ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహ స్థితులు ఉండగా షష్ట స్థానంలో రాహువు గాని లాభస్థానంలో గురువుగారు గాని చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఇస్తూ ఉంటారు. గురువుల యొక్క ఆశీసులు తప్పనిసరిగా ఉండాలి. వినోద కాలక్షేపాలు ఉంటాయి. సేవా భావనతో మీరు చేసేటటువంటి సేవ అంకిత భావం ఇవన్నీ కూడా మీకు చాలా వరకు మనశశాంతిని పెంపొందింప చేసే అంశాలే అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి నవధాన్యాలు దానం ఇవ్వండి.
సింహరాశి: సింహరాశి వారికి దూరప్రాంత ప్రయాణాలకి ఖర్చు పెడతారు అలాగే ఇంకా ఎవరికన్నా దానాలు ధర్మాలు చేయడానికి ఖర్చు పెడతారు. ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గారు గాని వీరిద్దరూ బంధుత్వాలతోనూ స్నేహాలతోనూ ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ తృతీయ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోరు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు గ్రహాలకి అనుకూలించేటటువంటి ఫలితాలు ఉంటాయి. మిగతా ఏడు గ్రహాల ఫలితాలు కూడా ఏమాత్రం అనుకూలించట్లేదు గురువుగారు సరే సరి వారు ధనాన్ని ఖర్చు చేయిస్తూ ఉంటారు. ఆదాయం వచ్చేటటువంటి గ్రహాలు ఏమైనా ఆ ఏడు గ్రహాలలో ఉన్నాయా అంటే ఆ ఏడు గ్రహాలు మీకు ఆదాయం ఇవ్వనివే కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహ స్థితుల ఫలితాల కోసం తప్పనిసరిగా నవగ్రహ హోమం చేయండి. నోటి ని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గా పూజ, గణపతి హోమ చేసుకోవడం వలన కొంత దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఈ పరిస్తి డిసెంబర్ వరకు ఉంటుంది కాబట్టి ఈ పూజ పునస్కారాల విషయంలో ఎట్టి పరి పరిస్థితిలో వెనకడుగు వేయొద్దు. కొత్త వ్యాపారాలు కూడా ఏవి ప్రారంభించకండి. అన్ని విధాల ఓర్పు కలిగి ఉండడము దైవధ్యానం చేసుకోవడము తప్ప కొత్తవాటికి ఇప్పుడు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వవద్దు అని చెప్పి తెలియజేస్తున్నానండి.
తులా రాశి: తులా రాశి వారికి చెప్పుకోదగ్గ అంశాలు ఏవైనా ఉన్నాయా అంటే ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ పూర్వ వైభవం వచ్చేస్తుంది పూర్వం మీరు ఎంత ఆనందంగా ఉన్నారో ఎంత కలిమిడిగా ఉన్నారో ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఎంత అదృష్టవంతులుగా ఉన్నారో ఇప్పుడు అవన్నీ రావడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అవసరానికి ఆదుకునే వాళ్ళు ఉంటారు. మాతృవర్గ రీచ్య బాగుంటుంది స్త్రీల వల్ల బాగుంటుంది. సంతానం విషయంలో అయితే కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సినటు వంటి పరిస్థితి. భార్యా భర్తల మధ్య అన్యోన్యత విషయంలో అంతగా అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు. బుధాదిత్య యోగం పడినందువల్ల కీర్తి ప్రతిష్టలకి దూరప్రాంత ప్రయాణాలకి లోటు లేకుండా ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి నవధాన్యాలు దానం ఇవ్వండి అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి అన్ని విధాల అనుకూలం అవుతుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా ధనం వస్తుంది విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార జీవితం బాగుంటుంది. అలాగే భార్యా భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. విద్యార్థులు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి. సంతానం విషయంలో ఎక్కువగా ఏదీ ఆశించవద్దు. తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది ధన ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంది మీ మాట తీరు చాలా చాలా బాగుండేటటువంటి అవకాశం ఉంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాల ని మీరు ఏమన్నా అధిగమించగలరా అంటే అద్భుతంగా అధిగమిస్తారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ వృశ్చిక రాశి వారికి కుజుని పరిస్థితి గాని అంతగా అనుకూలించబోవడం లేదు చంద్రుని పరిస్థితి కూడా అంతగా అనుకూలించబోవడం లేదు కానీ రవిగారి యొక్క స్థితి సంచారము లాభస్థానంలోకి వచ్చి బుధునితో కలిసి ఉండడం వల్ల అనేక విధాలుగా వీరికి ఆ బుధాదిత్య యోగ లక్షణాలు కీర్తి ప్రతిష్టలు ఉండడం చాలా బాగా కలిసి వస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. అర్ధాష్టమ రాహువు గారి యొక్క సంచారము అంత అనుకూలం కాదు కాబట్టి మాతృవర్గ రీచ అననుకూలత ఉన్నది అని చెప్పి తెలియజెప్తున్నాను. శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి తైలాభిషేకం చేయించండి శని గారికి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను.
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలానికి తృతీయ స్థానంలో రాహువు బాగున్నారు అలాగే దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. చెప్పుకోదగ్గ అద్భుతమైన సూచనలు ఏమిటి అంటే గురువుగారు అష్టమ స్థానంలో ఉండడం కొంచెం కష్టమే అయినప్పటికీ వారు ఉచ్చలో ఉంటున్న కారణం చేత ఇక్కడ హాని జరగనివ్వరు ఏదైనా దూరప్రాంత ప్రయాణాలలో ఇబ్బందులు ఉండడం, ధన నష్టం అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ కొంచెం మాతృవర్గ రీత్యా ఇబ్బందులు కనిపిస్తూ ఉండడం, స్థిరచరాస్తుల ఉనికి కొంచెం భంగం అవుతూ ఉండడం కానీ మన స్థలాలు ఎక్కడఉన్నాయి మన పొలాలు ఎక్కడఉన్నాయని వెతుక్కోవాల్సిన అవసరం. నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా నాకు ఈ మాత్రం సహాయం దొరుకుతుంది అని మీరు ఏ పాటి ఆలోచన చేసినా అది అంతకన్నా మించి జరగడానికి అవకాశం ఉంది.సంతానం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతానం సజావుగా ఉన్నట్టుగా ఉంటారు. భార్యా భర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వివాహేతర సంబంధాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో అక్కడ చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ స్కిన్ కి సంబంధించినటువంటి రుగ్మతలు ఉండడానికి కూడా అవకాశం ఉంది.
మకర రాశి: మకర రాశి వారికి నాలుగు గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు మకర రాశివారు ఏది పట్టుకున్న బంగారమే గోచార రీచ్య చాలా చాలా బాగుంది. జన్మ జాతక రీత్యా బాగా లేకపోయినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటు వంటి దశలు అంతర్దశలు కూడా పరిశీలన చేసి తెలియజెప్పవలసి ఉంటుంది. చక్కని తెలివితేటలు స్ఫురిస్తూ ఉంటాయి. ఏ సమస్యకైనా పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు అలాగే ఈ విజయావకాశాలు పోరుబాటలో ఉంటారు. ఇక భార్యా భర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. స్త్రీలతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితం బాగుంటుంది వ్యాపార జీవితం బాగుంటుంది. భార్యా భర్తల మధ్య పూర్తిగా అవగాహన లోపం ఏదైతే ఇంతవరకు జరిగి ఉన్నదో అవన్నీ కూడా సమసిపోయి చక్కటి అవగాహనతో మంచి అన్యోన్యత కలిగిన జీవితంతో ఉంటారు. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చక్కటి ఆనందమయ జీవితంలో ఉంటారు. శివారాధన చేయండి అలాగే రాహువు గారికి జపం చేయించుకోండి లేదా స్తోత్ర పారాయణాలు చేయండి మరింత సంతోషదాయకమైన జీవితం మీకు ఉంటుంది.
కుంభరాశి: కుంభరాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడుకొని ఉన్నటువంటి కాలం ఈ వారం రోజులే కాదు మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాము దగ్గర దగ్గర ఒక సంవత్సరం పైనుంచి ఒక సంవత్సరం మీద నాలుగు నెలల నుంచి చెప్పుకుంటున్నాం సంతాన రీత్యా పూర్తి ఓర్పుతో ఉండవలసిన కాలము రుణ భారాలు చేయవలసి వస్తుంది రుణం భారమే ఇంకా కొంచెం రుణం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అవమానాలు, అపనిందలు కనిపిస్తున్నాయి. అవతల వాళ్ళు మంచిగా ఉన్నా మీకు అనుమానంగానే ఉంటుంది అవతల వాళ్ళు ఏదన్నా మీరు గుర్తించలేని విధంగా ఉంటుంది. అంటే ఏది జరుగుతుందో దానికి ఆపోజిట్ గా మీరు ఆలోచిస్తారు ఆ రాహు కేతువుల ప్రభావం అలాగ ఉంటుంది ఏది కూడా మంచిగా తీసుకొనివ్వరు. మంచిని మంచిగా తీసుకొనివ్వరు చెడుని చెడుగా గుర్తించనివ్వరు. సంయమనం వహించండి. అన్ని రకాలుగాను మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దుర్గా అమ్మవారిని కూడా పూజించాలి. గణపతికి ఆరాధన చేయాలి. తదుపరి చంద్రుని యొక్క సంచారము లాభస్థానంలోకి వచ్చి కొంచెం మేలు కలిగిస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీ ప్రణాళికలు ఇవన్నీ కూడా కొంచెం విజయవకాశాలను తీసుకొని వస్తాయి. వారాంతంలో కొంచెం ఉపశమనం కలుగుతుంది. అప్పటివరకు కూడా ఏమాత్రం దిగులు పడకుండా ఆందోళన పడకుండా మనసుని దృఢంగా పెట్టుకొని మీరు మీ మీ పనుల్లో ముందరికి వెళ్ళిపోతూ ఉండండి భగవంతుని ఆరాధన చేయండి ఇంటి ఇలవేల్పుని ఆరాధన చేయండి.
మీనరాశి: మీన రాశి వారికి ఐదు గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందండి. అన్నిటికన్నా ముఖ్యంగా గురువుగారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉందండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇక్కడ అనుకోని విధంగా ఏదైనా చిన్నపాటి కష్టం వచ్చినా దాన్ని గట్టెక్కేస్తారు. అనుకున్నవి చాలా చక్కగా ప్రణాళికలు వేసుకొని దాన్ని ఆలోచించుకొని సాధించుకోగలుగుతారు. ధనము బాగా వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. గౌరవం వస్తుంది. మీ మాట చలామణి అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు ఎంత దైవభక్తిని మనసులో పెట్టుకొని చక్కగా భక్తి ప్రపత్తులతో భగవంతుడికి ఆరాధన చేస్తూ ఉన్నారో అది ఏదో ఒక రోజు భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పనికొస్తుంది. మీ అంతరంగంలో ఏదైతే కోరుకుంటున్నారో అది భగవంతుడు తీరుస్తాడు. ఉద్యోగ జీవితంలో ఇంక్రిమెంట్లు రావచ్చు .శని గారికి తైలాభిషేకం చేయించండి. గురువుగారి యొక్క దృష్టి కూడా రాశి మీద ఉంది కాబట్టి అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి శని గారి యొక్క దుష్ట ఫలితం అనేది తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను.మనకు Rs. 13 కు దొరికేది Rs.1300 కు కొంటున్నామా?




