Weekly Rasi Phalalu:
మేషరాశి: Mesham మేషరాశి వారికి ఈ వారం రోజులని పరిశీలన చేస్తే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయని మూడు గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైన ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు చంద్ర కుజులు తృతీయ స్థానంలో ఉన్నారు అలాగే లాభ స్థానంలో రాహువు గారు ఉన్నారు. ఈ మూడు గ్రహాలు కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉండగా గురువుగారు గాని శుక్రాచార్యుల వారు గాని రవి బుధులు గాని ఇక్కడ కోణంలో ఉన్నటువంటి రవి బుధులు కూడా చాలా మేలు చేస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాల రీచ బాగుంది స్థిర చరాస్తుల రీచ బాగుంది విద్యార్థులకి బాగుంది సంతాన రీచ కొంచెం ఓర్పు కలిగి ఉండండి చాలా చాలా బాగుంది రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వైవాహిక జీవితంలో జాగ్రత్తలు జాగ్రత త్తలే అది ఎప్పుడైనా గాన సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నప్పుడు స్నేహాలు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి ఇది అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కానీ యోగం అనేది మాలవ్య యోగం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ యోగం ఉన్నవారు చాలా బాగుంటారు.
వృషభ రాశి: Vrushabha వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే అంత అనుకూలతలు కనిపించబోవడం లేదు. ఇక్కడ చతుర్థ స్థానంలో బుద్ధుడు బాగున్నారు బుధాదిత్య యోగం బాగుంది అలాగే లాభ స్థానంలో శని గారు బాగున్నారు ఇక ఇంతకన్నా ఎక్కువగా చెప్పుకోవడానికి ఫలితాలు సహకరించబోవడం లేదు. ఈ రాశివారు ఎక్కువగా పరిహారాలకి ప్రాధాన్యతను ఇవ్వాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కీర్తి ప్రతిష్టల విషయంలో కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి పూర్వం కన్నా మేలుగా అనిపిస్తుందా అంటే పూర్వమే బాగుంది అనిపిస్తుంది ఉంది అంటే అంత ఓర్పుగా ఉండాలన్నమాట గడిచిపోయిన రోజులే బాగున్నాయి. కుటుంబ రిత్యా కూడా మీకు కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి ఈ ఓర్పు కలిగి ఉండాలి కుటుంబాన్ని కూడా కొంచెం సమయాన్ని కేటాయించి శ్రద్ధగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యస్య రాహవేకేత తవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పటించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్ సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.
మిధున రాశి: Midhuna మిధున రాశి వారికి ఈ వారం రోజులు కూడా పంట పండినటువంటి కాలమే చాలా అద్భుతంగా ఉన్నాయి స్థితులు రాశిలోనే చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ చంద్రుడు చాలా చాలా బాగున్నారు ద్వితీయంలో ఉచ్చలో గురువుగారు ఉన్నారు త్రితీయంలో రవి బుధ కేతువులు ఉన్నారు బుధాదిత్య యోగం ఉంది పంచ పంచమస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు ఇంకా ఏమి కావాలండి ఇక్కడ గ్రహాలు వరుస రాశుల్లో గ్రహమాలిక యోగాన్ని ఇస్తూ ఉండగా పంచమంలో శుక్రాచార్యులు వారు ధన యోగాలు బాగున్నాయి సంతాన రిత్యా చాలా చాలా బాగుంది. అలాగే ఉద్యోగ రిత్యా చాలా అద్భుతంగా ఉంది. కార్మికులు కర్షకులు నేతపనివారు చేతువృత్తుల వారు ఇత్యాది వారికి కొంచెం శారీరక శ్రమ ఉంటుంది. అయితే ధనము కూడా బాగా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి వ్యాపారాలు చాలా బాగున్నాయి. సమర్థవంతంగా వీరు పని చేసి పై ఉద్యోగస్తుల చేత మన్ననలు పొందుతారు కుటుంబ జీవితం బాగుంది భార్యా భర్తల మధ్య అన్యోన్యత బాగుంది మృష్టాన్న భోజనాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి అసలు ఒకటఏమిటండి విద్య బాగుంది ఉద్యోగం బాగుంది వ్యాపారం బాగుంది భార్య బాగుంది భార్య భర్తలు అనుకూలంగా ఉన్నారు వివాహ అది శుభ కార్యాలు కుదురుతున్నాయి. మొన్న మొన్నటి వరకు శుక్రాచార్యుల వారు ఇదే స్థానంలో నీచలో ఉన్నప్పుడు చెప్పుకున్నాం మనము మాతృవర్గ రిత్యా కాస్త బలహీన పడేటటువంటి కాలము అని ఇప్పుడు ఇప్పుడు మాతృవర్గ రీచ చాలా బలపడేటటువంటి కాలం వచ్చింది.
ప్రతి అంశం పట్ల కూడా శ్రద్ధగా ఉంటారు అలాగే అభివృద్ధిలో ఉన్నారు అని కూడా తెలియచెప్తున్నాను.
కర్కాటక రాశి: Karkataka కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి రాశిలో గురువుగారు ఉచ్చలో ఉన్నారు. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు. చతుర్ధంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ రాశులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలండి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి వ్యక్తిగతంగా ఉన్నతి ఉంటుంది అలాగే ధన ఆదాయం చాలా బాగుంటుంది మాట తీరు చాలా బాగుంటుంది అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి విద్యార్థులకి బాగుంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసేది కనిపిస్తుంది సంతాన రిత్యా కొంచెం ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము రుణభారాల విషయంలో రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యా భర్తల అనుబంధం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దూరప్రాంత ప్రయాణాలు కనిపిస్తున్నాయి. గురువుగారు రాశిలో ఉన్నప్పుడు ఎక్కడ అనర్థాలని సూచించరు. చెడు ఎక్కువగా జరగనివ్వరు కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు సూచితమైనప్పుడు అవి సూచనగానే ఉంటాయి. శారీరక పరమైన కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది ధనం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి చాలా చాలా అనుకూలమైనటువంటి యోగాలు చాలా బాగున్నాయి అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలోకి చంద్రబుధులు వచ్చేసారు ద్వితీయ స్థానంలో బుధుడు మంచి వాక్కుని ఇస్తూ ఉంటే తృతీయ స్థానంలోని బుధుడు ఇంకా ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఇస్తారు అన్నదమ్ముల సహాయ సహకారాన్ని ఇస్తారు ఇలా ఎన్నో రకాలుగా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అయితే ఇక్కడ ఆరోగ్య విషయంలో మటుకు కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి అలర్జీస్ ఎవరికైనా పూర్వం ఉన్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలలోనూ కూడా మీకు చాలా సంతృప్తికర జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను శుభం.
సింహరాశి: Simha సింహరాశి వారికి ఈ 6 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అని పరిశీలన చేస్తే మనము ప్రతి వారము ఏమి చెప్పుకుంటున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి రాశిలో కేతువు ఉన్నారు రాశిని చూస్తూ రాహువు ఉన్నారు అష్టమ స్థానంలో శని గారు ఉన్నారు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం ఈ వారం కూడా అదే చెప్పుకోవాల్సిన పరిస్థితి బాగుండడానికి చాలా బాగున్నాయి. గ్రహస్థితులు కానీ అవి అవి సింహరాశికి అనుకూలంగా లేవు ఒక లాభస్థానంలో కుజ చంద్రులు బాగున్నారు. అలాగే వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు మిగతావి ఏవి కూడా అనుకూలంగా లేవు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా నిందారోపణలు లేని విధంగా మీ ప్రవర్తన ఉండాలి చక్కటి ఆలోచనలతో ఉండాలి. ఎవ్వరిని కూడా అనుమానించకూడదు అలాగే అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఔషధ సేవ అవసరం పడుతోంది. మాట తీరు కూడా ఎవరిని నొప్పించే విధంగా ఉండకూడదు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేవు మాతృవర్గ రీచ్య అనుకూలంగా ఉంది స్థిరచరాస్తుల రీత్యా అనుకూలంగా ఉంది. అలాగే ఈ అష్టమ స్థాన సంచారంలో లోని శని గారికి మనము తప్పనిసరిగా తైలాభిషేకం చేసుకోవాలి. సింహ రాశి అది అంత పూర్తిగా అనుకూలంగా లేని కారణం చేత మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంతగా బాగుంటారు కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి వీలైనంతవరకు నవధాన్యాలు దానం ఇవ్వండి శని గారికి చెప్పిన విధంగా తైలాభిషేకం చేయించండి అని చెప్పి తెలియజేస్తున్నానండి.
కన్యారాశి: Kanya కన్యారాశి వారికి చాలా అనుకూలమైన కాలం ఈ వారం రోజుల గ్రహ స్థితుల పరిశీలనలో మనకి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. షష్ట స్థానంలో రాహువు గారు ఉన్నారు దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు ఏకాదశంలో గురువుగారు ఉన్నారు అన్ని ధనానికి సంబంధించిన భావాలు చాలా చక్కగా పరిడవిల్లుతూ ఉన్నాయి. ఇది ఎంత బ్రహ్మాండమైన సూచన అంటే మనకి గ్రహ స్థితులు ఉన్నత స్థితిని సూచిస్తూ ఉన్నాయి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. ధన ఆదాయం విషయంలో కీర్తి ప్రతిష్టల విషయంలో కుటుంబంలోని అన్యోన్యత విషయంలో మీరుమా మాట్లాడేటటువంటి మాట విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే చేపట్టిన కార్యక్రమాలఅన్నీ కూడా విజయవంతం అయ్యే దిశగా ఉన్నాయి పోరాట పటిమ బాగుంటుంది. ఏదైతే మీరు పోటీ పరీక్షలలో అది ఇంటర్వ్యూలు అవ్వచ్చు రాత పరీక్షలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు మీరు చాలా గట్టిగా విజయం సాధిస్తారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే అనుకూలమైనటువంటి వృత్తి గాని ఉద్యోగం గాని ఏదైనా సరే చాలా చాలా అనుకూలం అయపోయి మీకు ధన ఆదాయం పెరుగుతోంది మీ యొక్క వృత్తి ఉద్యోగ విషయాలలో మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. ఏదో ఒక విధంగా లాభాల బాటలో ఉంటారు వీరు అంత అద్భుతమైన ఫలితాలు వారాంతం నుంచి కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి శుభం.
తులా రాశి: Tula rasi తులా రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పొచ్చు. ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. రాశిలోనే శుక్రాచార్యుల వారు మాలవ్య యోగంలో సంచరిస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానంలో శని గారు బాగున్నారు .ఇక ఏకాదశంలో రవి బుధ కేతువులు వెరసి ఐదు గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే మాటలైన విషయం కాదండి పైగా లాభస్థానంలోనే మూడు గ్రహాలు అంటే ఎక్కడెక్కడ నుంచి రావలసినటువంటి ధనము మీకైతే ఉన్నదో అది కొన్ని రోజులు ముందరగానే వచ్చేస్తుంది. ఎప్పుడో రావాలి అనుకున్నది కూడా ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశము మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నతి కలిగేటటువంటి పరిస్థితి మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడించేటటువంటి పరిస్థితి కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి పరిస్థితి, ప్రయాణాలు లాభించేటటువంటి పరిస్థితి, స్త్రీల వల్ల చాలా అనుకూలం జరిగేటటువంటి పరిస్థితి, చాలా మేలు జరిగేటటువంటి పరిస్థితి. అలాగే స్త్రీలకి కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోయేటటువంటి పరిస్థితి ఇక సుఖమైన జీవనం కూడా ఉంటుంది. అలాగే షష్ట స్థానంలో శని గారి యొక్క స్థితి సంచారం కూడా చాలా అద్భుతంగా ఉన్నకారణం చేత ధనయోగాలకు ఇబ్బంది లేదు ఏదైనా పోటీ పరీక్షలలో గట్టి పోటీని ఎదుర్కొంటారు చక్కగా విజయం సాధిస్తారు శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోయి ఉంటుంది ఎన్నో రకాలుగా బాగుంటారు . ఆదిత్య హృదయం పారాయణ చేయండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయండి లలితా సహస్రనామాన్ని మటుకు విడవకుండానే చేయండి మీరు ఎంత భక్తితో చేస్తారో అంత చక్కటి అధ్య ఆధ్యాత్మిక చింతన పెరిగి మీకు అనుకూలించేటటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నానండి శుభం.
వృశ్చిక రాశి: Vruschika Rasi వృశ్చిక రాశి వారికి ఈ వారం పరిశీలన చేయగా మూడు గ్రహాల యొక్క అనుకూలత బాగుంది అని చెప్పాలి. శుక్రాచార్యుల వారికి నవమంలో గురువుగారు ఉన్నారు దశమంలో రవి ఉన్నారు అలాగే ఏ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు విలువైన వస్తువులని సేకరించుకోగలుగుతారు అలాగే భద్రపరుచుకోగలుగుతారు దూరప్రాంత ప్రయాణాలు చేయగలుగుతారు అనుకోని విధంగా ఈ లాభాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉద్యోగంలో చాలా అధికమైనటువంటి లాభాలు ఉన్నాయి ఉద్యోగ స్థితి బాగుంటుంది ఉద్యోగ స్థితి బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఆదాయం బాగుంటుంది మీ సమర్థతకి కి మంచి చక్కని కితాబు లభిస్తుంది అలాగే దైవభక్తి బాగా పెరుగుతోందండి దైవానికి సంబంధించి మీతోనే ఉన్నారా దేవుడు అనుకూలించాడా మీకే అన్నంత గొప్పగా పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ నవమంలో గురువుగారు ఉండి పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి ఇక వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా అవి రాంగరాంగా తగ్గిపోయేటటువంటి పరిస్థితే ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు రేపు ఉన్న కోపం ఉండదు అన్న సామెతగా రోజు రోజుకి వాళ్ళ యొక్క విభేదం తగ్గిపోయి అన్యోన్యత పెరగడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుందండి కార్మికులు కర్షకులు నేతపనివారు చేతివృత్తులో ఇచ్చాది వారందరూ చాలా చాలా బాగున్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికీ వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో రవిగారు అలాగే ఉన్నారు కానీ 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము లాభస్థానంలోకి వెళ్ళింది అలాగే చంద్రుడు కూడా లాభస్థానంలోకి వచ్చారు. ఏ స్థానంలో ఎటు శుక్రాచార్యుల వారు ఉన్నారు తిరిగి మూడు రాశుల్లో వరుస గ్రహాలు అనుకూలిస్తున్నాయి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇష్ట దేవత ఆరాధన చేయడం ద్వారా చాలా వరకు మనశశాంతి పెరుగుతుంది అని కూడా తెలియచెప్తున్నాను శుభం.
ధనస్సు రాశి: Dhanassu ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే తృతీయ స్థానంలో రాహు బాగున్నారు సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మూడు గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుంది అని చెప్పి మనం అనుకుంటున్నామో అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి ఇది చాలా చెప్పదగినటువంటి సూచన తృతీయ స్థానంలో రాహువు గారు ఇచ్చేటటువంటి ఫలితం ఇంత అంతా కాదు చాలా అద్భుతంగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని ఇస్తారు మనోబలాన్ని ఇస్తారు. దగ్గరి బంధువుల యొక్క ఆదరణని ఇస్తారు. ఒక పని చేయాలి అంటే అది ప్రణాళికాబద్ధంగా చేసి దాన్ని అనుకూలమైనటువంటి విజయాన్ని ఇచ్చేస్తారు. వస్త్ర లాభాలు వస్తు లాభాలు ధన లాభాలు. ద్రవ్య లాభాలు వాహన లాభాలు ఇలా అనేక రకాల లాభాలతో కూడి ఉన్నారు మిగతా అన్ని విషయాలలో మాతృ పతవర్గ రీచ్య కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఓర్పు కలిగి ఉండండి మాతృమూర్తి గారిని సేవించండి అలాగే పితృవర్గంతో కూడా ఓర్పు కలిగి ఉండండి తండ్రి గారిని సేవించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో పూర్వం కన్నా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. దక్షిణామూర్తి శ్లోకాల పారాయణ తప్పనిసరిగా చేయండి మరింత అనుకూలించేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను శుభం.
మకర రాశి: Makara Rasiమకర రాశి వారికి చాలా చాలా అనుకూలం అయ్యేటటువంటి స్థితులు ఈ వారం రోజులు కనిపిస్తున్నాయి. తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు షష్ట స్థానంలో చంద్ర కుజులు బాగున్నారు సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది స్త్రీలతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి స్నేహితులు చాలా చాలా బాగుంటారు అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి మీకు అదివరకు ఏవైతే నిందలు గాని అలాంటివి ఏమన్నా ఉన్నాయ అంటే అవన్నీ వెళ్ళిపోయి ఇ చాలా పేరు వస్తుంది మీ వ్యక్తిత్వం బాగా ఎనిమడి స్తుంది భార్యా భర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంటుంది. ఇబ్బంది లేకుండా మీకు ధనము చేతికి వచ్చేస్తుంది అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ పదిమందికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తారు. ధన ఆదా ఆదాయం పెరిగి ఆ కష్టాన్ని మర్చిపోయే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను.
ఇది గ్రహించగలరు మీ కుటుంబం మీద కొంత సమయాన్ని వెచ్చించగలరు అన్ని విధాల చక్కటి ఆనందమైన జీవితాన్ని కుటుంబంతో పంచుకోగలరు శుభం.
కుంభరాశి: Kumbha Rasi కుంభరాశి వారికి 6 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మనము ప్రతివారము చెప్పుకుంటున్న తీరుగానే ఈ వారం కూడా ఫలితాలు కొనసాగబడుతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే కీర్తి ప్రతిష్టలు ఉండవు సరి కదా వ్యక్తిగతంగా మీ మీద నిందలు ఉండడానికి అవకాశం ఉంది అవమానాలు మీరు పొందడానికి అవకాశం ఉంది. ఫలితాలే ఇక పంచమ స్థానంలో చంద్ర కుజులు ఉన్నారు పిల్లల విషయంలో వారి పెంపకం విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితి రుణాలు ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఇవన్నీ అన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉంటాయి. ఇక సప్తమ స్థానంలో రవి బుధ కేతువులు పబ్లిక్ రిలేషన్స్ లో వారు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులనే ఎదుర్కొంటారు. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు ఈ ఆదిత్య హృదయ పారాయణ చేయండి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి శివారాధన చేయండి దుర్గ నామాలు చేసుకోండి చాలా వరకు మీకు మనశాంతి పెరుగుతుంది కొంచెం అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి శుభం.
మీనరాశి: Meena Rasi మీన రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనుక మనము పరిశీలన చేసినట్లయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎట్టి పరిస్థితులలోనూ మీకు ఉన్నతే ఉన్నతి ఉన్నది పంచమ స్థానంలో గురువుగారు బాగున్నారు షష్ట స్థానంలో రవి బుధ కేతువులు బాగున్నారు శుక్రాచార్యుల వారు అష్టమ స్థానంలో ఉండి విలువైన వస్తువులని ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్లి అనుకూలించే ఫలితాలను ఇస్తున్నారు. అలాగే ఉన్నట్టుగా ఉండి అదృష్టం అనేది ఏ రూపకంగా వస్తుందో మనకి తెలియదు. మూడు గ్రహాల చేత విజయావకాశాలు బాగా ఉన్నాయి పోటీ పరీక్షలలో చాలా చక్కగా పాల్గొంటారు విజయం సాధిస్తారు శత్రువుల యొక్క బలహీనత ఏమిటి అనేది కనిపెట్టి దాన్ని దెబ్బదీసే విధంగా ప్రయత్నం చేస్తారు అలాగే బలం గల స్నేహితులతో చేతులు కలుపుతారు బలహీనుల పైన చక్కగా మీరు విజయం సాధిస్తారు బలవంతులతో కలిసినందువల్ల సంతృప్తిగా ఉంటారు విజయం తాలూకు ఆనందం చాలా చాలా బాగుంటుంది. కారణం చేత ఏదైనా వచ్చేటటువంటి ధనము కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అయినా కూడా మీరు సంయమనం పాటించండి అనుకున్న విధంగానే మీకు జరుగుబాటు ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి అని కూడా తెలియజెప్తున్నాను.. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను శివారాధన చేయండి ఎట్టి పరిస్థితుల్లోన ఈ పరిహారాలను మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ శుభం.




