Skip to content
తెలంగాణ

Hyderabad Food Safety: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు

మనిషి బ్రతకడానికి తిండి ఎంతో అవసరం, అలాంటి ఆహారాన్ని కల్తీ చేస్తున్న వాళ్ళను ఏమనాలి. అపరిశ్రుభ్రంగా వంట శాలలను ఉంచడం, ఆహార పదార్ధాలను కల్తీ చేయడం లాంటివి ఇష్టా రాజ్యం అయిపోయింది. అతి కొద్ది మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నా వాళ్ళలో చాలా మంది మామూళ్ళ మత్తులో ఉండిపోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఫుడ్ సేఫ్టీ అధికారులను పెంచితే ఉద్యోగ కల్పన చేసిన వాళ్ళు అవుతారు. అలాగే కల్తీ రాయుళ్ళు కూడా కొంత భయపడతారు. అసలు ఇలాంటి కల్తీ రాయుళ్ళు దొరికినపుడు ఆ కల్తీ ఆహారాన్ని వాళ్ళకే పెట్టాలని అనేక మంది స్థానికులు కోరుకుంటున్నారు. నిజం గా అలాంటి చట్టం వస్తే బాగుండి…ఇక విషయానికి వస్తే…

Hyderabad నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు మరోసారి బయటపడింది. తెలంగాణ స్టేట్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (Telangana State Authority for Food and Essential Drug) అధికారులు బుధవారం ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం ప్రాంతాల్లోని పలు ఆహార తయారీ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలు 20 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార తయారీ కేంద్రాలను తనిఖీ చేయగా, వాటిలో 9 చోట్ల తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

ఆహార పదార్థాల తయారీ, నిల్వ, వంటశాలల నిర్వహణలో కనీస ప్రమాణాలు పాటించకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో వెంటనే చర్యలు చేపట్టారు. ప్రజారోగ్యానికి ప్రమాదం కలిగించే పరిస్థితులు ఉన్నట్లు గుర్తించిన 9 హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు టీజీ సేఫ్ ప్రకటించింది. ఆయా సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ హోటళ్లకు షోకాజ్ నోటీసులు

గెలాక్సీ కేఫ్, అంటెరా, లక్కీ రెస్టారెంట్, జాయింట్ ఆల్‌మండి, విజయ రాఘవేంద్ర హోటళ్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే వన్ లాంజ్, కేఫీ కేఫ్, గ్రీన్‌లాండ్ దాబాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందిస్తున్నట్లు టీజీ సేఫ్ వెల్లడించింది.హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారయ్యే ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.